జ్వరంతోనే అదరగొడుతున్న ఎన్టీఆర్❗

  |   Tollywood

గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎన్టీఆర్ ..ఆ బాధను లెక్కచేయకుండా 'నాన్నకు ప్రేమతో' షూటింగ్ కోసం తెగ కష్టపడుతున్నాడు💦. ఎంతో క్లిష్టమైన డాన్స్‌ మూమెంట్స్‌ని బాధ పడుతూనే పూర్తి చేస్తోన్న తారక్‌ డెడికేషన్‌ని చూసి యూనిట్‌ సభ్యులు ముచ్చట పడుతున్నారు😲. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ అయిన విజయ్‌ సి. చక్రవర్తి అయితే తారక్‌ సిన్సియారిటీని, వృత్తి పట్ల తనకి వున్న నిబద్ధతని విపరీతంగా కొనియాడుతున్నాడు👏. రెండు రోజుల నుంచీ హైద‌రాబాద్‌లో ఈ పాటను తెర‌కెక్కిస్తున్నారు👌. అన్నట్లు ఎన్టీఆర్‌కు ఇది 25వ చిత్రం కావడం, సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి👍.