జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ర్యాలీ❗

  |   Tollywood

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఓ సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టర్లను ముద్రించారని, తక్షణం ఆ పోస్టర్లను తొలగించి సినిమా నుంచి కూడా ఆ దృశ్యాలను తీసేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు శనివారం బంజారాహిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు💢. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఈ పోస్టర్లపై ఫిర్యాదు కూడా చేశామని వెల్లడించారు👇. వందలాదిగా యువకులు బైక్ ర్యాలీతో వెళ్లడంతో బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది😫.