మళ్లీ ధోని సేనదే విజయం👍👍

  |   క్రికెట్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లోనూ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా ఘనవిజయం సాధించింది👍. శనివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల తేడాతో గెలిచింది👏. టీమిండియా విసిరిన 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తడబడింది😨. కార్డర్(45),జోరాన్ మోర్గాన్(50) మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో యువ ఆసీస్ జట్టు 49.2 ఓవర్లలో 185 పరుగులకే చాపచుట్టేసింది👎.