రాణించిన రోహిత్, పాండే❗❗

  |   క్రికెట్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ శనివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది👍. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధవన్(4), విరాట్ కోహ్లి(7) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది😟. ఆ తరుణంలో రోహిత్ శర్మ-అజింక్యా రహానేల జోడీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు💦. కాగా, రహానే(41) మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తడబడినట్లు కనిపించింది😨. అయితే రోహిత్ శర్మ (67; 82 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) , మనీష్ పాండే(58; 59 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో టీమిండియా గాడిలో పడింది😥. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించినా, ధోని(15), గుర్కీరత్ సింగ్ (6)లు నిరాశపరిచారు☝. చివరి వికెట్ గా అశ్విన్(4) పెవిలియన్ చేరడంతో టీమిండియా 49.1ఓవర్లలో 249 పరుగులకు పరిమితమైంది👆.