షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్❗❗

  |   క్రికెట్

గాయం కారణంగా పది నెలలు భారత జట్టుకు దూరమై తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పేసర్ మొహమ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు😱. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా అతనికి కనీసం 4 నుంచి 6 వారాలు విశ్రాంతి అవసరమని, అందుకే స్వదేశానికి వెళుతున్నాడని జట్టు ప్రకటించింది😫. ఆస్ట్రేలియా వెళ్లాక తొలి ప్రాక్టీస్ సెషన్‌లోనే అతను గాయపడ్డాడు. షమీ స్థానంలో పేసర్ భువనేశ్వర్ భారత జట్టులోకి వచ్చాడు☝. ఐదు వన్డేలు, మూడు టి20ల ఈ సిరీస్ ఈనెల 12 నుంచి జరుగుతుంది👍.