అఫ్గానిస్తాన్‌దే టి20 సిరీస్👍

  |   క్రికెట్

చూడటానికి చిన్న జట్టే అయినా మైదానంలో తిరుగులేని ఆటను చూపెట్టిన అఫ్గానిస్తాన్ జట్టు... జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది👏. మొహమ్మద్ షెహజాద్ (67 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) అంతర్జాతీయ టి20 చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు నమోదు చేయడంతో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గాన్ 81 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది👍. ముందుగా అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసింది. నబీ (22), అస్గర్ (18) ఫర్వాలేదనిపించారు👍.