జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ?❓

  |   Tollywood

హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలతో పశ్చిమాన పందెం కోళ్ల ముచ్చట ఎలా ఉన్నా సినిమా బరిలో మాత్రం నందమూరి హీరోలు ఢీ అంటే ఢీ అంటున్నారు👍. మునుపెన్నడూ లేని విధంగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌ల సినిమాలు కేవలం ఒక్కరోజు వ్యవధిలో విడుదల కానుండటంతో టీడీపీ నేతలు వర్గ రాజకీయాలకు తెరలేపారు👊. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా జోరును తగ్గించేలా థియేటర్ల కొరత సృష్టించనున్నట్టు తెలుస్తోంది😫. నాన్నకు ప్రేమతో సినిమా ఈనెల 13వ తేదీన, మరుసటి రోజు 14వ తేదీన బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా విడుదల కానున్నాయి☝.పొరపాటున ఈ సినిమా అటు ఇటు అయితే జూనియర్ సినిమా కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది👆. దీంతో ఇదే అవకాశంగా థియేటర్లు దొరక్కుండా చేసి జూనియ్ సినిమా కలెక్షన్లు దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం పావులు కదుపుతున్నారు😨.మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో పందెంకోళ్లలా దిగుతున్న నందమూరి హీరోల్లో హిట్‌టాక్ పరంగా ఎవరిది పైచేయి అవుతుందో నాలుగు రోజుల్లో తేలిపోనుంది✌.