బాబాయ్, అబ్బాయ్... ఎవరి బలమెంత..?❓❓

  |   Tollywood

ఎన్నడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతికి వెండితెర మీద భారీ యుద్ధం జరుగుతోంది😱. నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండం, వీటిలో మూడు టాప్ స్టార్ హీరోలు నటించిన సినిమాలే కావటం, ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి బాబాయ్, అబ్బాయ్‌లు బరిలో దిగుతుండటంతో పోరు మరింత రసవత్తరంగా మారింది😨. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా.. 'నాన్నకు ప్రేమ'తో సినిమాతో వస్తున్న ఎన్టీఆర్, 'డిక్టేటర్'గా గర్జిస్తున్న బాలయ్యల మధ్య పోటినే ప్రధానంగా చర్చకు వస్తోంది👍. బాలయ్య టిడిపి ఎమ్మెల్యేగా ఉండటం, ఈ మధ్య ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటంతో ఈ పోటీ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి కలిగిస్తోంది👍.సినిమాల విడుదల విషయంలో ఎత్తుకు పై ఎత్తులు కూడా బాగానే సాగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది☝. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేసేది తొలి రోజు.. తొలి వారం కలెక్షన్లే కావటంతో బాబాయ్, అబ్బాయ్‌లు రికార్డ్ వసూళ్ల మీద కన్నేశారు👀. అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో థియేటర్లు దక్కించుకోవటం కోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు💦. ఇన్నాళ్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల ప్రమేయంతో మాత్రమే జరిగిన థియేటర్ల ఎంపికలో ఈ రెండు సినిమాల విషయంలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి💪. అయితే ఈ విషయంలో కూడా అబ్బాయ్, బాబాయ్‌కి గట్టి పోటీనే ఇస్తున్నాడట👍.