మనసైనోడు ఎదురైతే మనువాడుతా💖💖

  |   Tollywood

మనసైనోడు తారసపడితే మనువాడడానికి సిద్ధమంటున్నారు నటి అనుష్క👌. అందంలోనే కాదు అభినయంలోనూ మేటి ఈ నటి👍. పాత్రలను అవగాహన చేసుకోవడం, వాటికి జీవం పోయడానికి శాయశక్తులా కృషి చేయడం లాంటి లక్షణాలే అనుష్క ఒక పరిపూర్ణ నటిగా ఉన్నత స్థాయికి చేర్చాయని చెప్పవచ్చు☝. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ కథానాయకులకు ధీటుగా రాణిస్తున్న అనుష్క ప్రస్తుతం బాహుబలి-2లో నటిస్తున్నారు😍. తమిళంలో సూర్యకు జంటగా ఎస్-3(సింగం సిరీస్ చిత్రం)లో నటించడానికి సిద్ధం అవుతున్నారు😃.