స్వదేశంలో ఆడటం భారత్‌కు లాభం❗ జహీర్ వ్యాఖ్య❗

  |   క్రికెట్

స్వదేశంలో ఆడనుండటం వల్ల రాబోయే టి20 ప్రపంచకప్‌లో భారత్ లాభపడుతుందని మాజీ పేసర్ జహీర్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు👍. ఇక్కడి పిచ్‌లపై స్పిన్ ఆడటంలో మనవాళ్ల నైపుణ్యం వల్ల భారత్ టైటిల్ ఫేవరెట్‌గా మారిందన్నాడు☝. ‘కచ్చితంగా ఈ టోర్నీలో భారత్ రాణిస్తుంది👍. టి20 కావడంతో పాటు టోర్నీ ఉపఖండంలో జరుగుతుంది👆. ఇక్కడ స్పిన్‌దే కీలక పాత్ర👍. మనం స్పిన్‌ను చాలా బాగా ఆడతాం✋. కాబట్టి ఇది టోర్నీలో బాగా లాభిస్తుంది☝. ఆటలో వచ్చిన చాలా మార్పులు చాలా ఉత్సాహాన్ని తెచ్చాయి😆.బ్యాట్స్‌మన్ కూడా కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు👍.