హార్దిక్ పాండ్యా వీరబాదుడు✨

  |   క్రికెట్

ఇటీవల టీమిండియా ట్వంటీ 20 జట్టులో స్థానం సంపాదించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వీరవిహారం చేశాడు👍. ఒకే ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు👌. ముస్తాక్ ఆలీ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ రిలయన్స్ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన టీ 20 లో బరోడా ఆటగాడు హార్దిక్ పాండ్యా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు👏. ప్రత్యేకంగా ఢిల్లీ మీడియం పేసర్ అకాశ్ సుడాన్ వేసిన 19.0 ఓవర్ లో ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు సాధించాడు👍. కాగా, ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు నమోదు చేసిన పలువురు క్రికెటర్ల సరసన చేరే అవకాశాన్ని పాండ్యా తృటిలో కోల్పోయాడు👇.