తొలి వన్డేలో భారత్ ఓటమి👎

  |   క్రికెట్

ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో 310 పరుగులు ఛేదించడం అంత సులువు కాదు☝.గతంలో రెండు సార్లు మాత్రమే ఇలా జరగ్గా...‘వాకా’ మైదానంలో ఏ జట్టుకూ అది సాధ్యం కాలేదు👆.కానీ కెప్టెన్ స్మిత్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌కు మాజీ కెప్టెన్ బెయిలీ మెరుపులు జతకలవడంతో తొలి వన్డేలో కంగారూలు అలవోకగా దానిని చేసి చూపించారు👍.కంగారూ జోడీ ప్రదర్శన ముందు రోహిత్ భారీ సెంచరీ, కోహ్లి మెరుపులు చిన్నబోవడంతో ప్రపంచకప్ సెమీస్‌కు కొనసాగింపుగానా అన్నట్లు అదే ఫలితం పునరావృతమైంది😟.