ది రెవెనెంట్‌కు గోల్డెన్‌గ్లోబ్ అవార్డుల పంట✨

  |   Tollywood

ప్రపంచ చలన చిత్రరంగంలో ఆస్కార్ తరువాత అంతటి కీర్తిప్రతిష్టలున్న పురస్కారం ‘గోల్డెన్‌గ్లోబ్’ అవార్డు🏆. 2015గాను ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన చిత్రంగా ‘ది రెవెనెంట్’ నిలిచింది👏. కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రబృందం ఆనందడోలికల్లో తేలిపోయింది😂. ఈ సినిమా ఉత్తమచిత్రంగా, దర్శకత్వం వహించిన అలెజాండ్రో జిఇనారిట్టు ఉత్తమ దర్శకుడిగా, ఇందులో ప్రధానపాత్ర పోషించిన లియోనార్డొ డి కాప్రియో ఉత్తమ నటుడిగా గోల్డెన్‌గ్లోబ్ అవార్డులు కైవసం చేసుకున్నారు👍.కాగా 2015 సంవత్సరానికి సంబంధించి బెస్ట్‌మోషన్ పిక్చర్‌గా ది రెవనెంట్ నిలిస్తే కామెడి, మ్యూజిక్ విభాగాల్లో ‘ది మార్టియన్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది👌. ఇక మోషన్ పిక్చర్స్ విభాగంలో ఉత్తమ నటిగా ‘రూమ్’ హీరోయిన్ బ్రి లార్సన్ ట్రోఫీ ఎగరేసుకుపోగా ఉత్తమ సహాయ నటిగా కటె విన్స్‌లెట్ అవార్డు నెగ్గింది👍.