నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్‌పై పవన్‌కల్యాణ్ ఫిర్యాదు❓❓

  |   Tollywood

టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్‌కళ్యాణ్ ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాత భోగవల్లి ప్రసాద్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో కేసు వేయడం చర్చనీయాంశమైంది😰. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం రూపొందింది☝. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది👍. అప్పట్లో నిర్మాత భోగవల్లి ప్రసాద్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో పవన్ తన రెమ్యూనరేషన్‌ని తగ్గించుకున్నారు👆. ఆ సినిమాకు ఒప్పుకున్న రెమ్యూనరేషన్‌లో ఇంకొంత ఇవ్వాల్సి వుంది☝. అయితే, భోగవల్లి ప్రసాద్ తన తదుపరి చిత్రం రిలీజ్‌లోపు ఇస్తానని మాట ఇచ్చారు✋. కానీ అది ఆయన నిలుపుకోలేకపోవడంతో పవన్‌కళ్యాణ్ ‘మా’ను ఆశ్రయించాడు👊. దాంతోపాటు నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేశారు😫. మొత్తానికి ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది😉. మరోవైపు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు సిద్ధమైంది👀.