బీబీఎల్‌లో గేల్‌పై విమర్శల వర్షం😱😱

  |   క్రికెట్

మహిళా కామెంటేటర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై మరో దుమారం చెలరేగింది👎. బిగ్ బాష్ లీగ్‌లో అతని ఆటతీరుపై మాజీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు👊. సోమవారం రాత్రి సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సహచరుడు టామ్ కూపర్ ఓ సింగిల్ కోసం గేల్‌ను పిలిచాడు☝. ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సులువుగా పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ విండీస్ బ్యాట్స్‌మన్ పరుగు తీసేందుకు నిరాకరించాడు👆. అంతే కామెంట్రీలో ఉన్న మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్... గేల్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు😡.