లుంగీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన ధోనీ, ప్రభుదేవా!👯

  |   క్రికెట్

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్‌ ఆడటంలో ఆయనది ప్రత్యేకమైన ధనాధన్‌ శైలి👍. హెలికాప్టర్ షాట్లతో మైదానంలో రెచ్చిపోవడమే కాదు.. లుంగీ కట్టుకొని ప్రభుదేవాతో పోటీపడి స్టెప్పులు కూడా వేయగలనని తాజాగా ఆయన నిరూపించాడు👍.ఓ మోటార్‌ బైక్ వాణిజ్య ప్రకటన కోసం ధోనీ దక్షిణ భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు👌. ఈ యాడ్‌లో దక్షిణాది స్టైల్‌లో లుంగీ కట్టడే కాదు.. గ్రేట్‌ డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు వేశాడు👏.రజనీకాంత్‌ గౌరవార్థం 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొన్‌ చేసిన 'లుంగీ' డ్యాన్స్ సూపర్‌హిట్‌👍. ఇప్పుడే అదే స్టైల్‌లో ధోనీ, ప్రభుదేవా లుంగీ మోకాళ్లపైకి కట్టుకొని డ్యాన్స్ చేశారు👯.