దక్షిణాఫ్రికా 267/7⭐⭐

  |   క్రికెట్

ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా నెమ్మదిగా ఆడుతోంది👍. ఎల్గర్ (46), ఆమ్లా (40) ఓ మాదిరిగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 7 వికెట్లకు 267 పరుగులు చేసింది☝. మోరిస్ (26 బ్యాటింగ్), రబడ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టుకు ఎల్గర్, వాన్ జెల్ (21) శుభారంభాన్నివ్వలేకపోయారు👆.ఇంగ్లండ్ పేసర్ల ధాటికి 44 పరుగులకే తొలి వికెట్ కోల్పోయారు👎. అయితే ఆమ్లా నిలకడగా ఆడి ఎల్గర్‌తో రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చాడు👏. తర్వాత డివిలియర్స్ (36) కాసేపు ఆడే ప్రయత్నం చేసినా.. మిడిలార్డర్‌లో సహకారం కరువైంది👇. చివర్లో మోరిస్, రబడ వికెట్‌ను కాపాడుకుంటూ ఏడో వికెట్‌కు అజేయంగా 42 పరుగులు సమకూర్చారు☝.