భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే నేడు ❗❗

  |   క్రికెట్

భారత జట్టు ఆస్ట్రేలియాపై వారి దేశంలో విజయం సాధించి నాలుగేళ్లయింది☝. 2012 ఫిబ్రవరిలో అడిలైడ్‌లో జరిగిన వన్డేలో ధోని లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు👍. ఆ తర్వాత కంగారూలను వాళ్ల గడ్డపై ఎప్పుడూ ఓడించలేదు👆. ఈసారి తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా విజయం మాత్రం అందలేదు👎. ఐదు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్‌లో ఓడితే ఇక సిరీస్‌లో కోలుకోవడం చాలా కష్టం💦. అందుకే నేడు జరిగే రెండో వన్డేలో గెలిస్తే ధోనిసేనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది✌. మరి సంక్రాంతి రోజైనా భారత శిబిరంలో విజయ క్రాంతి కనిపిస్తుందా..👀