మరణం అంచుల వరకూ వెళ్లా.. సచిన్😱😱

  |   క్రికెట్

ముంబై రైల్వే పోలీసులు రైలు ప్రయాణికుల కోసం సమీప్, (సేఫ్టీ అలర్ట్ మెసేజెస్ ఎక్స్క్లూజ్వ్లీ) బీ- సేఫ్ అనే రెండు సందేశాలపై ముంబైలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన సచిన్ మాట్లాడాడు. ఈ పందర్భంగా చిన్నతనంలో తనకు ఎదురైన భయానకమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు😨.స్కూల్లో చదువుకునే రోజుల్లో తనకు దాదాపు 11 ఏళ్ల వయసునుంచి రైల్లో ప్రయాణించడం తనకు అలవాటు అని తెలిపారు☝. కానీ అప్పుడు జరిగిన ఓ సంఘటన తన కళ్ల ముందు ఇంకా మెదులుతూనే వుంటుందన్నాడు😨. ' అయిదాగురు ఫ్రెండ్స్ కలిసి విల్లే పార్లే లో మరో స్నేహితుని ఇంటికి భోజనానికి వెళ్లాం👬. అనంతరం సినిమా చూస్తూ ఉండిపోయాం, ఈ క్రమంలో ప్రాక్టీస్కు వెళ్లడం ఆలస్యం అయింది👆. సమయం మించిపోతోందనే హడావుడిలో ప్లాట్ ఫాంకి వేగంగా వెళ్లాలనే తొందరలో రైలుపట్టాలను దాటుతున్నాం🏃. సరిగ్గా మధ్యకు చేరుకున్నాం👇. ఇంతల్లో ట్రాక్స్ పైకి రైళ్లు వేగంగా దూసుకొస్తున్నాయి😱. దీంతో అక్కడే ట్రాక్స్ మధ్య లో మా మోకాళ్లపై వంగి కూర్చొని, ప్రాణాలు అరచేత పట్టుకొని కూర్చుండిపోయాం' అని సచిన్ తన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు😰.