రతన్‌పూర్‌లో సర్దార్✨

  |   Tollywood

సంక్రాంతి బరిలో లేకున్నా టీజర్, కొత్త పోస్టర్లతో అభిమానులు పండగ చేసుకునేలా చేశారు పవన్ కల్యాణ్:tada:. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘గోపాల గోపాల’ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. కే.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ‘రతన్ పూర్’ టౌన్ సెట్‌లో జరుగుతోంది:thumbsup:. ఇందులో పవన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు:couple:.