ఆమిర్.. 25 వారాల్లో 25 కేజీలు..!❗❗

  |   Tollywood

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, ప్రస్తుతం తను చేస్తున్న సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్నాడు💦. మల్లయోధుడు మహావీర్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న దంగల్ సినిమాలో నటిస్తున్న ఆమిర్, ఆ పాత్ర కోసం భారీగా బరువు పెరిగాడు☝. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో 55 ఏళ్ల వయసులో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా కనిపించనున్న ఆమిర్ ఖాన్👆. అందుకు తగ్గ ఆహార్యం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకొని బరువు పెరిగాడు💪. ఆ భాగం షూటింగ్ పూర్తవ్వటంతో ఆమిర్ ఇప్పుడు బరువు తగ్గే పనిలో ఉన్నాడు👇. నెక్ట్స్ షెడ్యూల్లో తన వయసుకన్నా మరింత యంగ్గా కనిపించటం కోసం ఏకంగా 25 కేజీల బరువు తగ్గటానికి కసరత్తులు చేస్తున్నాడు💪. ఇప్పటికే డైట్ మార్చేసి సన్నబడే పనిలో ఉన్న ఆమిర్, ప్రముఖ డైటీషియన్ డాక్టర్ వినోద్ దురందర్ పర్యవేక్షణలో 25 వారాల్లోనే 25 కేజీల బరువు తగ్గాలని ప్లాన్ చేసుకున్నాడు👍.