ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేసేశాడు❓❓

  |   Tollywood

సంక్రాంతికి నాన్నకు ప్రేమతో అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు😳. ఇప్పటికే కొరటాల శివ దర్శతక్వంలో 'జనతా గ్యారేజ్' సినిమాను ప్రారంభించాడు ఎన్టీఆర్❗. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మాత్రం వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు☝. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు జూనియర్👌. జనతా గ్యారేజ్ ను ఆగస్టు 12న ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు👍.