'క్వీన్' ఆత్మకథ కంగనా రనౌత్✨

  |   Tollywood

వరుస బ్లాక్ బస్టర్స్తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా సవాల్ చేసిన హాట్ బ్యూటీ కంగనా రనౌత్👍. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ ఫ్యాషన్ గాళ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా నిరూపించుకుంది👌. లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా 100 కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించిన కంగనా మరో సంచలనానికి రెడీ అవుతోంది👏. కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కంగనా, తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావటానికి ప్రయత్నిస్తుందట👍. బర్తాదత్ రాసిన 'ద అన్క్వయిట్ ఇండియా' బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్, ఈ విషయాన్ని ప్రకటించింది✋. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్లో తనను ఇబ్బంది పెట్టిన కొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది💦.