'శ్రీ శ్రీ' ఘట్టమనేని వారి 'మనం'😂😂

  |   Tollywood

అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా మనం👍. తెలుగు తెర మీద సరికొత్త ప్రయోగంగా తెరకెక్కిన ఈ సినిమా, నటవారసత్వం కొనసాగిస్తున్న చాలా మంది హీరోలకు ఇన్సిపిరేషన్గా నిలిచింది☝. ఈ సినిమా తరువాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలా కుంటుబాల నుంచి ఆ తరహా సినిమాలను ఆశిస్తున్నారు అభిమానులు😄. అలా ఫ్యామిలీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానుల కోరిక తీరనుందన్న టాక్ వినిపిస్తోంది😬.లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్రోల్లో నటిస్తున్న సినిమా శ్రీ శ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి, కృష్ణ సతీమణి విజయనిర్మల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు👫. అంతేకాదు ఈ సినిమాలో ఈ తరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, మహేష్ తనయుడు గౌతమ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది👍.