ఇండియా ఫస్ట్ బ్యాటింగ్👍👍

  |   క్రికెట్

ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లలో 300కు పైగా పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఆదివారం మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో వన్ డేలో అమీతుమీకి సిద్ధమైంది😫. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు☝. దీంతో వరుసగా మూడో మ్యాచ్ లోనూ తొలి ఇన్నింగ్స్ లోనే భారత్ బ్యాటింగ్ కు దిగినట్లయింది👆. మెల్‌బోర్న్ మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లలో మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు అలవోకగా 300కు పైగా పరుగులు చేసేసింది👍. ఇలాంటి స్థితిలో భారత్ ఎంత లక్ష్యం విధిస్తే గెలుపు దక్కుతుంది? సిరీస్ చేజారకుండా ఉంటుంది? ఈ సారైనా మన బౌలర్లు ప్రత్యర్థిని అడ్డుకోగలరా? ఎన్నో ప్రశ్నలతో ధోని సేన చావోరేవోలాంటి మూడో వన్డేలో బరిలోకి దిగుతోంది👀.