'ధోనీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది'❓❓

  |   క్రికెట్

గబ్బా స్డేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలు వస్తున్నాయి😱. అయితే, బౌలర్ల వైఫల్యం వెంటాడుతుండటంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ వైఫల్యాల ప్రభావం ధోనిపై ఉంది☝. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ ధోనీ గత రెండు వన్డేల్లోనూ నిరాశపరిచాడు👎. టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ధోనీకి మరింత టైమ్ ఇవ్వాలని, అతడు త్వరలోనే క్రీజులో కుదురుకుంటాడని కెప్టెన్ కు మద్దతు తెలిపాడు☝. కానీ, ధోనీ చివరి ఐదు ఇన్నింగ్స్ స్కోర్లు వరుసగా 47, 15, 27, 18, 11 మాత్రమే ఉండటం బ్యాటింగ్లోనూ అతని వైఫల్యాన్ని తెలుపుతుంది👆. మిస్టర్ కూల్ గా పేరుగాంచిన ధోనికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పుకొచ్చారు😫. టెస్టులకు గుడ్ బై చెప్పిన ధోనీ, గతేడాది అక్టోబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండటం ఓ కారణమై ఉండవచ్చు అన్నారు👐.