సంక్రాంతి సోగ్గాడు✨✨

  |   Tollywood

చిత్రం: ‘సోగ్గాడే చిన్ని నాయనా’
తారాగణం: నాగార్జున, లావణ్యా త్రిపాఠీ, రమ్యకృష్ణ
మూలకథ: పి. రామ్మోహన్
స్క్రీన్‌ప్లే: సత్యానంద్
కళ: ఎస్. రవీందర్
కెమేరా: పి.ఎస్. వినోద్, ఆర్. సిద్ధార్థ్

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: అక్కినేని నాగార్జున
రచన - దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల

తొలి చిత్ర దర్శకుడైన కల్యాణ్‌కృష్ణకు సమష్టి కృషి తోడుగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌కు ఇది ముందడుగు👍. వెరసి, మన పల్లెటూళ్ళు, మన వాతావరణం, మన తెలుగువారి పంచెకట్టు, మన బంధుత్వాలు, సరదాలను తెరపైకి తేవడంతో ఇది అచ్చమైన సంక్రాంతి ఫెస్టివల్ ఫిల్మ్👌. కుటుంబమంతా హ్యాపీగా చూసే అవకాశాలతో సంక్రాంతి రిలీజుల బాక్సాఫీస్ పందెంలో గెలుపుకోడి✌.