సెహ్వాగ్ వారికి క్రికెట్ రుచి చూపించాడు❓❓

  |   క్రికెట్

ఒకప్పటి భారత్ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ స్టార్స్ని కలిశారు👬. కుస్తీ యోధులకు సరదాగా కాసేపు క్రికెట్ను చవి చూపించారు☝. తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ లను తీసుకుని సెహ్వాగ్ శుక్రవారం డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్ స్టార్ డాల్ఫ్ జిగ్లర్, డబ్ల్యుడబ్ల్యుఈ దివాస్ చాంపియన్ చార్లెట్ను కలిశారు👋. ఈ సందర్భంగా వీరూ వారికి క్రికెట్ పాఠాలు నేర్పారు👌. బౌలింగ్ చేయడం, క్యాచ్ పట్టడం, బ్యాటింగ్ లోని మెళకువలను వివరించారు👍.వీరంతా కలిసి ఓ చిన్న సైజ్ మ్యాచ్ కూడా ఆడారు👍. సెహ్వాగ్ తమకు మొదటిసారి క్రికెట్ ఆటను రుచి చూపించారని, ఇది మర్చిపోలేని అనుభూతి అని డాల్ఫ్, చార్లెట్ పేర్కొన్నారు☝. సెహ్వాగ్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడాన్ని తాను చాలా ఎంజాయ్ చేశానంటూ డాల్ఫ్ చెప్పారు😂.