జట్టులోకి తిరిగి వస్తా: ఇర్ఫాన్ పఠాన్👍👍

  |   క్రికెట్

ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన ధ్యేయమని ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు👍. రంజీ, విజయ్ హజారే ట్రోఫీల్లో రాణించడంతో పాటు తాజాగా ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఇప్పటిదాకా అతను 15 వికెట్లు తీసి టాపర్‌గా ఉన్నాడు👏. ‘సీజన్ మొత్తం ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఆడగలుగుతున్నాను👍. ఫస్ట్‌క్లాస్, దేశవాళీల్లో ఆడే ఏ ఆటగాడికైనా అంతిమ లక్ష్యం జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే☝. నేను కూడా దీనికి మినహాయింపు కాదు’ అని పఠాన్ తెలిపాడు👍.