ప‌వ‌న్ నోరు విప్పేది కోట్ల కోస‌మేనా?❓❓

  |   Tollywood

ప‌వ‌న్ క‌ల్యాణ్‌... మూడొచ్చిన‌ప్పుడు పూన‌కం వ‌చ్చిన‌ట్టు మాట్లాడేస్తుంటాడు☝. కానీ.... మిగిలిన స‌మ‌యంలో మైకు ముందు మ‌హా సిగ్గు. మీడియాతో అస్స‌లు ఇంట్రాక్ట్ అవ్వ‌డు👎. ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌👆. అలాంటిది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ టీవీ ఛాన‌ల్‌లో టాక్ షో నిర్వ‌హించ‌బోతున్నాడ‌న్న టాక్ ప‌వ‌న్ అభిమానుల్ని కూడా విస్మ‌ర‌ప‌రుస్తోంది😼. బాలీవుడ్ దిగ్గ‌జం.. అమీర్ ఖాన్ స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ.. ఓ టాక్ షో నిర్వ‌హించాడు🙀. సినీ గ్లామ‌ర్‌కు దూరంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే అజెండాగా సాగిన కార్య‌క్ర‌మం ఇది😸. ఈ షో ద్వారా.. అమీర్‌... సామాన్యుల అభిమానం కూడా సొంతం చేసుకొన్నాడు☝. ఇప్పుడు ప‌వ‌న్ నిర్వ‌హించే టాక్ షో ఉద్దేశం కూడా అదేన‌ట‌👆. ఎలాగూ ప‌వ‌న్ పాలిటిక్స్‌తో బిజీ కాబోతున్నాడు💦. ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాలంటే ఓ ఫ్లాట్‌ఫామ్ కావాలి👌. జ‌న సేన ఉద్దేశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నా, ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌ను ఎండ‌గ‌ట్టాల‌న్నా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌న్నా.. ఓ వేదిక ఉండాలి☝. అందుకే.. ఈ టాక్ షో నిర్వ‌హించ‌డానికి ఓకే అనేశాడ‌ని తెలుస్తోంది👌. అంతే కాదండోయ్‌... వీట‌న్నింటి వెనుక కోట్ల‌ ఆలోచ‌న‌లూ ఉన్నాయి☝. ఈ షో ద్వారా... భారీగా ఆదాయాన్ని వెన‌కేసుకోవాల‌ని చూస్తున్నాడు💰. ఈ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చే టోట‌ల్ రెవిన్యూలో స‌గం.. ప‌వ‌న్ ఖాతాలోకి వెళ్తుంద‌ట‌☝.