మ‌ర‌ణం లేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్✨✨

  |   Tollywood

సృష్టినే శాశించిన‌ మ‌నిషి.. అంత‌రిక్షాన్ని సైతం అదుపులో పెట్టుకొన్న అత‌ని మేధ‌స్సు... మ‌ర‌ణాన్ని మాత్రం జ‌యించ‌లేక‌పోయింది.❗❗.!అలాంటి మ‌ర‌ణం కూడా కొంత‌మంది ముందు త‌ల‌వొంచుతుంది👍.. ఆ మ‌హా మ‌నిషి కి స‌లాం కొడుతుంది🙏. ఎన్టీఆర్ కూడా.. అలాంటి మ‌హ‌నీయుడే విశ్వ విఖ్యాత‌.. న‌ట‌ విరాఠ్‌.. న‌వ‌ ర‌స‌న‌ట‌నా సార‌భౌమ‌.. ఎన్టీఆర్ గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా.. తెలుగువారి హృద‌యాలు ఉప్పొంగుతాయి😂. తెలుగుజాతి స‌గ‌ర్వంగా ఛాతీ ఎత్తుకొని నిల‌బ‌డుతుంది👌. తెలుగుద‌నం తొడ‌కొట్టి స‌వాల్ చేస్తుంది.. అదంతా ఎన్టీఆర్ ఘ‌న‌తే! ఆయ‌న తెలుగువారినీ, ఈలోకాన్ని విడ‌చి 20 యేళ్లు గ‌డిచిపోయాయి😭. అయినా ప్ర‌తీ రోజూ.. ఏదో ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌ని త‌ల‌చుకొంటూనే ఉన్నాం☝. మ‌న అన్న‌ని స్మ‌రిస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ ముద్ర అలాంటిది.. ఆయ‌న ఘ‌న‌త అంత‌టిది👏.