టి20 ప్రపంచకప్ తర్వాత పూర్తిస్థాయి కోచ్: ఠాకూర్❗❗

  |   క్రికెట్

స్వదేశంలో మార్చిలో జరిగే టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు పూర్తిస్థాయి కోచ్‌ను నియమిస్తామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు☝. కోచ్ ఎంపికలో సలహా కమిటీ సభ్యులు సచిన్, లక్ష్మణ్, గంగూలీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు👆. ఏడాదిన్నరకు పైగా జట్టు డెరైక్టర్‌గా పని చేస్తున్న రవిశాస్త్రి టి20 ప్రపంచకప్ వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు👆. ఆస్ట్రేలియా నుంచి భారత క్రికెటర్లు తిరిగి వచ్చాక డీఆర్‌ఎస్‌పై వారితో మాట్లాడతామని ఠాకూర్ చెప్పారు👍.