భారత జట్టులో బౌలర్ బుమ్రా❗❗

  |   క్రికెట్

గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన మొహమ్మద్ షమీ స్థానంలో టి20 సిరీస్‌కు గుజరాత్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు👍. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్న బుమ్రా... గత సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఆకట్టుకున్నాడు✌. జనవరి 26 నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది☝. యువరాజ్, నెహ్రా, రైనా, పాండ్యా, హర్భజన్‌లతో కలిసి బుమ్రా 22న ఆస్ట్రేలియా వెళతాడు👍.