వందో సినిమా... ఆదిత్య 999✨

  |   Tollywood

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ఏ దర్శకుడితో ఉంటుంది? ఎలాంటి చిత్రం చేస్తారు? ఈ ప్రశ్నకు సోమవారం సమాధానం దొరికింది👍. హైదరాబాద్‌లో జరిగిన ‘డిక్టేటర్’ విజయోత్సవంలో వందో చిత్రం గురించి బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు🙌. పాతికేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాను చేసిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999’ తన వందో చిత్రమని తెలిపారు👏. ఈ సీక్వెల్ కూడా సింగీతం దర్శకత్వంలోనే రూపొందనుందని చెప్పారు👌. ఇప్పటికే స్టోరీబోర్డ్‌తో సహా సిద్ధమైన ఈ కథ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది👊.