శ‌హ‌భాష్ జూనియ‌ర్‌!👏👏

  |   Tollywood

నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో చంద్ర‌బోస్ రాసిన ఓ పాటుంది☝..వాళ్లు నిన్ను విసిరేశామ‌ని అనుకొన్నారు... వాళ్ల‌కు తెలీదు నువ్వొక బంతివ‌ని...వాళ్లు నిన్ను పాతేశామ‌ని అనుకొన్నారు☝.. వాళ్ల‌కు తెలీదు నువ్వొక విత్త‌న‌మ‌ని☝..ఇలా సాగుతుందా పాట‌!విసిరిందెవ‌రో, పాతేసిందెవ‌రో... ఎన్టీఆర్ అభిమానుల‌కు విడ‌మ‌ర్చి చెప్ప‌క్క‌ర్లెద్దు👋.నాన్న‌కు ప్రేమ‌తో సినిమా విడుద‌ల‌కు ముందు న‌డిచిన హైటెన్ష‌న్ డ్రామా ప్ర‌త్యేకంగా గుర్తు చేయ‌న‌వ‌స‌రం లేదు👍. ఓ వ‌ర్గం ఎన్టీఆర్ సినిమా బ‌య‌ట‌కు రాకుండా విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింద‌ని ఓ ప్ర‌ధాన ప‌త్రిక సైతం కోడై కూసింది👆. థియేట‌ర్లు దొర‌క్కుండా కొంత‌మంది, అస‌లు ఈ సినిమాకి బ‌య్య‌ర్లే లేకుండా మ‌రికొంతమంది పావులు క‌దిపారు😥. 'ఎన్టీఆర్ సినిమాకి థియేట‌ర్లు ఇస్తే మీ అంతు చూస్తా'మ‌నే రేంజులో ఆ బెదిరింపులు సాగాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌👊. అంతెందుకు సినిమా రేపే విడుద‌ల‌.. అన్న‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం.. రంగంలోకి దిగాడు👉. ''పాత బాకీ చెల్లించి సినిమా విడుద‌ల చేసుకోండి'' అంటూ భీష్మించాడు😨. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంతోడికి రెండు కోట్లు ఓ లెక్కా... అదీ.... ఓ సినిమా విడుద‌ల‌కు ముందు.. ఈ ఎత్తుగ‌డ నిర్మాత‌ని ఇబ్బంది పెట్ట‌డానికే అన్న‌ది ఎవ్వ‌రికైనా సుల‌భంగా అర్థ‌మ‌య్యే సంగ‌తి✋.13న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర... య‌మ స్పీడుగా పరిగెట్టేసింది. బ‌రిలో బాబాయ్ ఉన్నా, నాగ్ వ‌న్నెచిన్నెలు చూపించినా, ఎక్స్‌ప్రెస్ రాజా అడ్డొచ్చినా బాక్సాఫీసు ద‌గ్గ‌ర బుడ్డోడి స్పీడుకు బ్రేకులు వేయ‌లేక‌పోయారు👌.