12 బంతుల్లో హాఫ్సెంచరీ చేసిన క్రిస్ గేల్👍

  |   క్రికెట్

వెస్ట్ ఇండిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు👏. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు👍. ఆడిలైడ్ స్ట్రైకర్స్తో మెల్బోర్న్ రెనిగేడ్స్తో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆడిలైడ్ టీం 170 పరుగులు చేసింది☝. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మెల్బోర్న్ టీం ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది👆. ఓపెనర్ క్రిస్ గేల్ తొలి ఓవర్లోనే 4 సిక్సర్లు కొట్టడంతో 27 పరుగులు చేసింది👆. ఈ క్రమంలో క్రిస్ గేల్ ఏడు సిక్సర్లు, ఒక ఫోర్తో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు👏. మొత్తం 17 బంతులు ఆడిన గేల్ 56 పరుగులు చేసి ఔటయ్యాడు☝. అయితే గేల్ చెలరేగినా మెల్బోర్న్ రెనిగేడ్స్ మాత్రం గెలవలేక పోయింది👎. 15.3 ఓవర్లలోనే 143 పరుగులు చేసి ఆలౌటయింది👇.