అనంతపురం కోర్టులో ధోనీకి ఊరట!❗❗

  |   క్రికెట్

అనంతపురం కోర్టులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఊరట లభించింది☺. ఓ కేసులో ఆయనకు వ్యతిరేకంగా తాను ఇచ్చిన నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ ఉత్తర్వులను కోర్టు వెనుకకు తీసుకుంది☝. బిజినెస్ మ్యాగజీన్ కవర్ పేజీపై ధోనీ విష్ణుమూర్తి అవతారంలో కనిపించి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ స్థానిక వీహెచ్‌పీ కార్యకర్త వై శ్యాంసుందర్ కోర్టులో కేసు నమోదు చేశారు😡. ఈ కేసులో గత ఏడాది జనవరి 7న ధోనీకి వ్యతిరేకంగా అనంతపురం కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీచేసింది☝. ధోనీ తరఫున ఢిల్లీకి చెందిన న్యాయవాదులు రాజనిష్‌ చోప్రా, పంకజ్ భగ్లా మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు👦. గతంలో కోర్టు జారీచేసిన నాన్‌ బెయిలబుల్ వారెంట్‌కు ధోనీకి అందలేదని వారు మేజిస్ట్రేట్‌ గీతావాణికి తెలిపారు👆. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు తన ఉత్తర్వులను వెనుకకు తీసుకుంది☝. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ధోనీ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే👍. ఈ నేపథ్యంలో ధోనీ తరఫున ఆయన కేసును ఇకముందు తాను వాదించేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి 'వకాలత్‌నామా'ను దాఖలుచేశారు😟.