నాన్న‌ని చూసి నేర్చుకోండ‌య్యా...!నాగ‌చైత‌న్య ,అఖిల్✨✨

  |   Tollywood

నాగ్‌ని టాలీవుడ్ మ‌న్మ‌థుడు అని ఎందుకంటారో.. సోగ్గాడే చిన్నినాయ‌న చూస్తే మ‌రోసారి అర్థ‌మైపోతుంది👍. ఈ వ‌య‌సులోనూ... ఆ గ్లామ‌ర్ చెక్కు చెద‌ర‌లేదు👌. మ‌రీ ముఖ్యంగా పంచె క‌ట్టుకొని న‌డిచొస్తుంటే.. ఫ్యాన్సు విజిల్సే విజిల్సు👏. మ‌రో ప‌దేళ్ల‌యినా అదే హుషారు క‌నిపిస్తుందే అన్నంత భ‌రోసా వ‌చ్చేసింది✨. ఆ ఎన‌ర్జీ చూసి ఫ్యాన్సంతా మురిసిపోతున్నారు😂. బంగార్రాజు విన్యాసాలు చూసి త‌రించిపోతున్నారు. ''మ‌రి అబ్బాయిలు ఎప్పుడు షైన్ అవుతారో..'' అనిపిస్తోంది కూడా☝. అవును మ‌రి.. నాగ‌చైత‌న్య ఇండ్ర‌స్ట్రీలో అడుగుపెట్టి దాదాపు ప‌దేళ్ల‌యిపోతోంది👆. ఇప్ప‌టి వ‌ర‌కూ నాన్న‌లా ఎన‌ర్జీ చూపించ‌లేక‌పోయాడు👊.అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కూడా అంతే. డాన్సులు జోరుగా వేశాడు గానీ.. స‌న్నివేశాల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి డ‌ల్ అయిపోయాడు😫. ఇప్పుడు వీరిద్ద‌రూ... సోగ్గాడే చిన్నినాయిన మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలి😐. నాన్న‌లో... ఈ వ‌య‌సులోనూ అంత ఈజ్ ఎలా వ‌చ్చిందో ఆరా తీయాలి... ఆ ర‌హ‌స్యాన్నిఛేందించాలి👍. అప్పుడే తండ్రికి త‌గ్గ త‌న‌యులు అనిపించుకొనే ఛాన్స్ ద‌క్కుతుంది👌.