'నేను దర్శకేంద్రుణ్ని కాదు..!'❗❗

  |   Tollywood

దర్శకేంద్రుడు అంటే ఎవరో తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకం పరిచయం చేయాల్సిన అవసరం లేదు☝. వందకు పైగా చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దిగ్దర్శకుడు రాఘవేంద్రరావును అభిమానులు దర్శకేంద్రుడిగా పిలుచుకుంటారు👍. ఓ సభా వేదిక మీద ప్రముఖ రచయిత సి నారాయణరెడ్డి, రాఘవేంద్రరావును దర్శకేంద్రుడిగా సంబోధించటంతో ఆ బిరుదు ఆయనకు స్థిరపడిపోయింది✨. అయితే ఈ జనరేషన్లో దర్శకేంద్రుడు ఎవరనే విషయాన్ని రాఘవేంద్రరావు స్వయంగా ప్రకటించారు❓. అందరూ నన్ను దర్శకేంద్రుడు అంటారు☝. కానీ నేను ఆ బిరుదుకి అర్హుడుని కాదేమో అని నా అభిప్రాయం👆. ఇంద్రుడు అంటే ఒక్కడే ఉండాలి✋. కానీ నా జనరేషన్లో నేను, దాసరి ఇద్దరం ఉన్నాం👇. కానీ ఈ జనరేషన్లో మాత్రం దర్శకేంద్రుడు రాజమౌళే' అంటూ కితాబిచ్చారు👌. అంతేకాకుండా తాను ఆత్మకథ రాస్తే దానికి 'నేను దర్శకేంద్రుణ్ని కాదు.. నేను దర్శకుణ్నే' అని పేరు పెడతానని తెలిపారు✋. శిరిడి సాయి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాఘవేంద్రరావు త్వరలో నాగార్జున ప్రధాన పాత్రలో వెంకటేశ్వరస్వామి కథతో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు👏.