బ్రాండ్ భామ తమన్నా 👍

  |   Tollywood

గత ఏడాది ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది గ్లామర్ భామ తమన్నా✨. ఆమె తాజాగా నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమాలో గ్లామర్‌తో ప్రేక్షకుల్ని పిచ్చెక్కించింది👌. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ మరోవైపు కమర్షియల్ ప్రోడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ప్రచారం కల్పిస్తోంది👍. తాజాగా సామాజిక అంశంతో రూపొందే ‘బేటీ బచావో, బేటీ పడావో’ ఫెడరేషన్‌కి తమన్నా ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది👏. ఇటీవలే ఆగ్రాలో జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది. రెగ్యులర్, కమర్షియల్ యాడ్స్ చేస్తూనే సమాజానికి హెల్ప్ అయ్యే ‘స్వచ్ఛ్భారత్’, ‘పేటావారి బిఎ’ ‘బన్నీస్ హనీ- బ్రై క్రూయల్టీ ఫ్రీ కాస్మొటిక్’ అనే బ్రాండ్‌లతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుందట👌. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ఊపిరి’ చిత్రంలో నటిస్తోంది😍.