రానాపై చైతూ రివేంజ్..?❓❓

  |   Tollywood

సౌత్ ఇండస్ట్రీలో మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్ను సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, స్టార్ డైరెక్టర్ మణిరత్నం👍. ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన మణిరత్నం తన తదుపరి సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు☝. నాగార్జున, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేసినా, అది వర్క్ అవుట్ కాలేదు👎. దీంతో అదే సినిమాను కార్తీ, దుల్కర్ సల్మాన్లు ప్రధాన పాత్రల్లో ప్లాన్ చేశాడు☝. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో వీరు కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు👇.తాజాగా ఇదే సినిమాను నాగచైతన్య, రానాలు హీరోలుగా తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడట👍. రివేంజ్ డ్రామగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతు, రానాలు కలిసి నటిస్తే పబ్లిసిటీ పరంగా కూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు👌.ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ సారైన ఈ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకువస్తాడేమో చూడాలి👍.