విజయం కోసం ధోనిసేన ఆరాటం 💦💦

  |   క్రికెట్

ఆస్ట్రేలియా పర్యటనలో సాధారణంగా బ్యాట్స్‌మెన్ విఫలమై సిరీస్‌లు అప్పజెప్పడం చాలాకాలంగా భారత్‌కు ఆనవాయితీ☝. కానీ ఈసారి మాత్రం బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేస్తున్నా మ్యాచ్‌లు గెలవలేకపోతున్నారు👎. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ధోనిసేన మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే పరువు దక్కించుకుంటుంది👍. మరోవైపు తొలిసారి భారత్‌తో స్వదేశంలో ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయాలనేది ఆస్ట్రేలియా లక్ష్యం☝. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి🙌.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆస్ట్రేలియా పిచ్‌లపై పరుగుల వరద పారుతోంది👏. సిరీస్‌లో తొలి మూడు వన్డేల్లోనూ ఊహించని విధంగా భారీ స్కోర్లు వచ్చాయి✌. నాలుగో వన్డే కూడా దీనికి అతీతం కాకపోవచ్చు👆. మరోసారి ఫ్లాట్ పిచ్‌పై సమరానికి రెండు జట్లు సిద్ధమయ్యాయి👀.