ఓటమికి నాదే బాధ్యత: ధోని😫

  |   క్రికెట్

నాలుగో వన్డేలో అనూహ్య పరాజయం కెప్టెన్ ధోనిని కూడా ఇరకాటంలో పడేసింది😰. ఒక వైపు మ్యాచ్ ఓడగా, కీలక సమయంలో డకౌట్‌తో తాను కూడా దానికి కారణమయ్యాడు☝. అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఓటమి భారాన్ని అతను తనపై వేసుకున్నాడు👆. ‘నాకు కోపం రావడం లేదు కానీ బాగా నిరాశ చెందాననేది వాస్తవం😵. ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నా👍. నేను అవుట్ కావడం మ్యాచ్ ఫలితం మార్చింది💥. ’ అని ధోని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు✋.నొప్పి తగ్గే వరకు రహానేను బ్యాటింగ్‌కు పంపలేకపోయామని, అతను ఆలస్యంగా బరిలోకి దిగడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించిందని కెప్టెన్ అన్నాడు✊. ఇంతటి ఒత్తిడిలో కొత్త కుర్రాళ్లు ఆడటం కష్టమని గుర్‌కీరత్, రిషి ధావన్‌లకు మద్దతు పలికిన మహి... జడేజాను మాత్రం విమర్శించాడు😮. ‘లోయర్ ఆర్డర్‌లో జడేజా బ్యాట్స్‌మెన్‌కు తగిన సూచనలిస్తూ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తే బాగుండేది👍. కానీ అతను ఆ పని చేయలేదు’ అని చురక అంటించాడు💥.