నాలుగో వన్డేలో భారత్ అనూహ్య పరాజయం👎

  |   క్రికెట్

6 బంతుల్లో చేయాల్సిన పరుగులు 72, రన్‌రేట్ ఆరుకంటే తక్కువ, చేతిలో 9 వికెట్లు...ఈ స్థితిలో ఏ జట్టయినా మ్యాచ్ ఓడిపోతుందా..! ❗పటిష్ట జట్లతో తలపడినా పసి కూనలు కూడా సంచలనం కోసం పట్టుదలగా ఆడతాయి💦. కానీ భారత స్టార్ బ్యాట్స్‌మెన్ మాత్రం బొక్కబోర్లా పడిపోయారు👎. 46 పరుగుల వ్యవధిలో అన్ని వికెట్లూ చేజార్చుకొని ఓటమిని కావలించుకున్నారు👎. ఫించ్ సెంచరీ, వార్నర్ మెరుపులతో ఆస్ట్రేలియా ఏకంగా 349 పరుగుల కొండలాంటి లక్ష్యం భారత్ ముందుంచింది👆. ఫామ్‌లోకి వచ్చిన ధావన్, ఫామ్ అంటిపెట్టుకునే ఉన్న కోహ్లి శతకాల మోతతో స్కోరును 277 పరుగుల దాకా తెచ్చాక ఇక గెలుపు ఖాయమనిపించింది👆. కానీ భారత్ చేతకానితనం, ఆసీస్ పోరాటం కలిసి ఫలితాన్ని మనకు వ్యతిరేకంగా మార్చి పడేశాయి👇.