ఫిబ్రవరి నుంచే కొత్తచిత్రం😍😍

  |   Tollywood

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ దాదాపు పూర్తికాగా, ఈ సినిమా తరువాత మహేష్ నటించే కొత్తచిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి😬. ప్రముఖ తమిళ సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు👍. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోనే సినిమాను మొదలుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు👌. దీనికి మహేష్ కూడా ఓకె అన్నాడని తెలిసింది👍. న్యాయవ్యవస్థపై పోరాటం అనే అంశంతో తెరకెక్కే ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది💵. ఈ చిత్రానికి హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు🎶. మురగదాస్-మహేష్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి😍.