ఫస్ట్ టైమ్ మహేశ్‌తో కలిసి నటిస్తున్నా : నరేశ్😄

  |   Tollywood

సీనియర్ నటుడు నరేశ్ పుట్టినరోజు వేడుక బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది🎉. ఈ వేడుకలో సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు, ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, నటులు శివాజీరాజా, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు👪. నరేశ్ మాట్లాడుతూ - ‘‘కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల నా కెరీర్‌కు మూలస్తంభాల్లాగా నిలిచారు👍. ఈ ఏడాది రిలీజైన ‘నేను... శైలజ’ తో నాకు మళ్లీ సక్సెస్ స్టార్ట్ అయింది👍. ఎప్పటి నుంచో మహేశ్‌తో కలసి నటించాలనుకున్నాను👬. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో ఆ కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది😂. 2016 నాకు ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా’’ అని చెప్పారు🌟.