మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది..?

  |   Tollywood

తొలి సినిమాతోనే టాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మలయాళీ భామ కీర్తి సురేష్👌. రామ్ హీరోగా తెరకెక్కిన 'నేనూ శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కీర్తి సురేష్☝.తొలిసారిగా టాలీవుడ్లో మెరిసిన ఈ భామ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది⭐.ఇప్పటికే రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్ రీమేక్లో కీర్తి సురేష్ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తుండగా, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఈ అమ్మడిని వరించింది👍. మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ సరసన ఓ భారీ చిత్రానికి కీర్తి సురేష్నే ఫైనల్ చేశారట👍.