చివరి వన్డేకు మ్యాక్స్ వెల్ అనుమానం❓❓

  |   క్రికెట్

టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం జరుగనున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు మ్యాక్స్ వెల్ ఆడే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి☝. బుధవారం జరిగిన నాల్గో వన్డే లో ఇషాంత్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఓ బంతి మ్యాక్స్ వెల్ కుడి మోకాలను బలంగా తాకింది😥. ఇషాంత్ లెగ్ సైడ్ వేసిన బంతిని అందుకునే క్రమంలో దాటిగా ఆడబోయిన మ్యాక్స్ వెల్ ముందుకు వంగబోయి గాయపడ్డాడు😢. దీంతో మ్యాక్స్ వెల్ చివరి వన్డే తు☝ది జట్టులో ఆడే అవకాశాలు కనబడుట లేదు👎. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఓ ప్రకటన విడుదల చేసింది🙌. ఇంకా మ్యాక్స్ వెల్ కాలి గాయం వాపు తగ్గలేదని స్పష్టం చేసింది. అతనికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం కావొచ్చని తెలిపింది👍.