నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్!😏

  |   Tollywood

బుల్లితెరపై బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వెండితెరపై కూడా విజృంభించాలని ఫిక్స్ అయ్యారు👍. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జున మరదలి పాత్రలో మెరిసి, భేష్ అనిపించుకున్న అనసూయ ఇప్పుడు ఓ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు👌. నటుడు అడివి శేష్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించిన ‘క్షణం’ చిత్రంలో ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేశారు👍. ఇది ఫుల్ లెంగ్త్ రోల్☝. ఈ చిత్రంలో ఆదా శర్మ, అడివి శేష్ కూడా నటించారు👫. ఒక పాప, బాబు చుట్టూ తిరిగే చిత్ర కథ ఇది👆. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది👍.