'ఇక ధోనికి గుడ్ బై చెప్పండి'❗❗

  |   క్రికెట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలైన టీమిండియా జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది😵. ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ లో కూడా భారత జట్టు గెలవకపోవడంతో పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది👂. తాజాగా ధోని నాయకత్వంపై భారత మాజీ లెజెండ్ స్పిన్నర్ ఎర్రపల్లి ప్రసన్నవిమర్శనాస్త్రాలు సంధించాడు☝. తన దృష్టిలో ఇక ధోని సారథ్య బాధ్యతలకు వీడ్కోలు చెబితే మంచిదన్నాడు✋. ధోనిని బ్యాట్స్ మెన్ గా, కీపర్ గా పరిమితం చేసి వన్డే కెప్టెన్గా కోహ్లిని నియమిస్తే జట్టు ప్రయోజనాలకు మంచి జరుగుతుందన్నాడు👆. త్వరలో భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ వరకూ ధోనినే కెప్టెన్ గా నియమించిన సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించుకోవాలని ప్రసన్న ఈ సందర్భంగా తెలిపాడు☝.